నా ఫస్ట్ తెలుగు డబ్బింగ్ అంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-03-14 02:55:36  IST  )

కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నా ఫస్ట్ తెలుగు డబ్బింగ్ అంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా శ్రీనిధి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ఫస్ట్ టైం తను ‘హిట్-3’(HIT-3) సినిమాకు గానూ తెలుగులో డబ్బింగ్ చెబుతున్నట్లు రాసుకొచ్చింది. అంతేకాకుండా డబ్బింగ్ చెబుతున్న సూపర్ క్యూట్ ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు గుడ్ జాబ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శైలేష్ కొలను(Sailesh Kolanu) తెరకెక్కిస్తున్న సినిమా ‘హిట్-3’.

ఇది బ్లాక్ బస్టర్ మూవీ ‘హిట్‌’(HIT)కు సీక్వెల్‌‌‌గా వస్తున్న సినిమా. అయితే ఈ చిత్రంలో నేచురల్ స్టార్ అర్జున్ సర్కార్ పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక దీనిని హీరో నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి తిపిర్నేని(Prasanthi Tipirneni) నిర్మిస్తున్నారు. కాగా ఇందులో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిక్కీ జె. మేయర్(Mickey J. Meyer) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 1న విడుదల కానుంది.

Read More..

పుణ్య క్షేత్రాల చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్ హీరోయిన్.. అందుకోసమే అంటూ నెటిజన్ల కామెంట్స్



Next Story