పుణ్య క్షేత్రాల చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్ హీరోయిన్.. అందుకోసమే అంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-14 02:54:54  IST  )

‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే.

పుణ్య క్షేత్రాల చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్ హీరోయిన్.. అందుకోసమే అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘జోరు’(Joru), ‘జిల్’(Jill), ‘బెంగాల్ టైగర్’(Bengal Tiger), ‘శివం’(Shivam), ‘సుప్రీమ్’(Supreme), ‘హైపర్’(Hyper), ‘జై లవకుశ’(Jai Lava Kusa), ‘రాజా ది గ్రేట్’(Raja The Great), ‘ఆక్సిజన్’(Oxigen), ‘టచ్ చేసి చూడు’(Touch chesi Chudu), ‘తొలిప్రేమ’(Tholi Prema), ‘ప్రతి రోజు పండగే’(Prati Roju Pandage), ‘వెంకీ మామ’(Venky Mama), ‘వరల్డ్ ఫేమస్ లవర్’(world Famous Lover), ‘పక్కా కమర్షియల్’(Pakka Commercial), ‘తిరు’(Thiru) వంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.

కానీ ఈ అమ్మడుకు ప్రజెంట్ తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్‌(Bollywood)కి చెక్కేసి అక్కడ ఇటీవలే ఓ వెబ్ సిరీస్ చేసింది. అలాగే ఐటెం సాంగ్స్‌లో చిందులేస్తూ ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది ఈ అమ్మడు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో తన తల్లితండ్రులతో శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంది. అంతేకాకుండా ఆ ఫొటోకు హర హర మహదేవ్ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు తెలుగులో ఆఫర్ల కోసం పుణ్య క్షేత్రాల చుట్టూ తిరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

HHVM: పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఆ రోజే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్



Next Story