యంగ్ హీరోయిన్ వెంటపడుతున్న హీరోలు.. ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదుగా..

by Chukka Sudharani |   (  Updated:2025-08-14 12:29:48  IST  )

ఓం భీమ్ బుష్’(Om Bheem Bush) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్(Preethi Mukundan).

యంగ్ హీరోయిన్ వెంటపడుతున్న హీరోలు.. ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదుగా..
X

దిశ, సినిమా: ‘ఓం భీమ్ బుష్’(Om Bheem Bush) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్(Preethi Mukundan). ఇక మొదటి సినిమానే మంచి హిట్ అందుకోవడంతో.. కోలీవుడ్‌లో ఆఫర్ అందుకుని ‘స్టార్’ అనే చిత్రంతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. ఇలా పట్టిన రెండు ప్రాజెక్టులు హిట్ కావడంతో.. కెరీర్ స్టార్టింగ్‌లో ‘కన్నప్ప’(Kannappa) వంటి భారీ ప్రాజెక్టులో మంచు విష్ణు(Manchu Vishnu) పక్కన నటించే ఆఫర్ అందుకుంది. అయితే.. సినిమాలో తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టేసిన ఈ అమ్మడు ప్రమోషన్స్‌లో కానీ సక్సెస్ మీట్‌లో కానీ ఎక్కడ కనిపించలేదు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటుంది. రీసెంట్‌గా మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ (Nivin Pauly) మూవీలో ప్రీతి హీరోయిన్‌గా సెలక్ట్ కాగా.. తాజాగా మలయాళంలో మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ‘మైనే ప్యార్ కియా’(Maine Pyaar Kia) అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హృదు హరూన్ (Hridhu Haroon) హీరోగా నటిస్తున్నాడు. సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఓనమ్ స్పెషల్‌గా ఆగస్టు 29న రిలీజ్‌కు సిద్ధం అయింది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి ఓపినింగ్ ఇచ్చిన ఈ అమ్మడు మాలీవుడ్‌లో కూడా సక్సెస్ అందుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ప్రీతి ముకుందన్ చేతిలో ప్రస్తుతం.. మాలీవుడ్‌తో పాటు తమిళంలో కూడా రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే.. తెలుగులో మాత్రం కన్నప్ప తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ప్రీతి.

Next Story