Suhas: నాకేంటి ఈ టార్చర్.. రిపోర్టర్ ప్రశ్నపై యంగ్ హీరో షాకింగ్ రియాక్షన్

by Chukka Sudharani |   (  Updated:2025-03-24 14:36:12  IST  )

‘కలర్ ఫొటో’ (Color photo) సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఈమేజ్‌(Special image)ను క్రియేట్ చేసుకున్నాడు హీరో సుహాస్

Suhas: నాకేంటి ఈ టార్చర్.. రిపోర్టర్ ప్రశ్నపై యంగ్ హీరో షాకింగ్ రియాక్షన్
X

దిశ, సినిమా: ‘కలర్ ఫొటో’ (Color photo) సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఈమేజ్‌(Special image)ను క్రియేట్ చేసుకున్నాడు హీరో సుహాస్ (Suhas). వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ హీరో త్వరలో ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama) చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. లవ్ రొమాంటిక్ కామెడీ (Love Romantic Comedy) చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో మాళవిక మనోజ్ (Malavika Manoj) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్ గోదాల (Ram Godala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ (Glimpses) ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ (Teaser) రిలీజ్ చెయ్యగా సోషల్ మీడియాలో విశేషస్పందన లభిస్తోంది. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.

ఇందులో భాగంగా ‘యాక్టింగ్ (Acting) నుంచి యాడ్స్‌(Ads)కి వచ్చారు. అయితే.. ఒక యాడ్ చేస్తే సినిమాకు ఎంత చార్జ్ చేస్తున్నారో.. యాడ్‌కు కూడా అంతే చార్జ్ చేస్తున్నారని బయట టాక్. ఇది ఎంత వరకు నిజం’ అని సుహాస్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనిపై సుహాస్ స్పందిస్తూ.. ‘జీవితం.. నాకు ఇదేం టార్చర్ (Torture) అయిపోయింది. మంచిగానే ఇచ్చారు అంతే. కాకపోతే మీరు అనుకున్నంత నెంబర్ అయితే లేదు. నేను యాక్టింగ్ బాగా చేస్తాను అది వదిలేసి రెమ్యునరేషన్ బాగా తీసుకుంటున్నారు ఇవన్ని మాట్లాడుతున్నారు’ అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు హీరో. కాగా.. ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రాన్ని వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మిస్తుండగా.. ఇందులో.. అనిత హస్సానందని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Read More..

ఓటీటీలోకి వచ్చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘అగత్యా’.. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల

Next Story