- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో.. ఆ క్రేజ్ ఏంటీ భయ్యా అంటున్న నెటిజన్లు
తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సుహాస్ (Suhas).

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సుహాస్ (Suhas). హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్న ఈ హీరో.. త్వరలో ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు రామ్ గోధల (Ram Godhala) దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ (Malavika Manoj) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. సమ్మర్ స్పెషల్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
కమెడియన్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా మారి సినిమాలు తీస్తున్నాడు కోలీవుడ్ నటుడు సూరి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మందాడి’ (Mandadi). మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, అచ్యుత్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. తాజగా ఈ చిత్రంలో సుహాస్ కూడా భాగం అయ్యాడు. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సుహాస్ బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో కనిపిస్తుండగా.. ఆ క్రేజ్ ఏంటీ భయ్యా అప్పుడే కోలీవుడ్‌పై కూడా కన్నేశా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






