- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన యంగ్ హీరో.. లవ్ యూ చెప్తూ షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) అతిలోక శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) అతిలోక శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. హిందీలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ‘ధడక్’ మూవీతో వచ్చిన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. గత ఏడాది ఏకంగా మూడు సినిమాల్లో నటించిన జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలో రాణిస్తోంది. చేసింది తక్కువ మూవీస్ అయినప్పటికీ అనతి కాలంలోనే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’(Devara: Part 1) సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే ఘన విజయం అందుకుని తన పాపులారిటీ పెంచుకుంది. తెలుగులో అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘RC-16’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తుండగా.. దీనికి బుచ్చిబాబు(Buchibabu) సనా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్ ఓ వైపు షూట్‌లో పాల్గొంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ హీరో రోహిత్ ఆమెకు స్పెషల్ గిఫ్ట్ పంపాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ఓవై గాడ్.. మధురమైన బహుమతి.. లవ్ యూ రోహిత్ సరాఫ్’’ అని రాసుకొచ్చింది. అయితే అసలు ఆ గిఫ్ట్ ఏంటంటే.. ఒక పెట్టె లోపల కుక్క నేథ్యంతో కూడిని బర్త్ డే కేక్ ఉంచబడింది. ఈ కేక్ చాక్లెట్ ఫ్రాస్టింగ్‌తో మెత్తటి గోధుమ రంగు కుక్క ముఖంలా కనిపించేలా రెడీ చేశారు. అందులో హ్యాపీ బర్త్ డే జేకే అనే ట్యాగ్‌ను జత చేసి దాన్ని మరింత స్పెషల్‌గా రూపొందించారు. కాగా, నటుడు రోహిత్ సరాఫ్, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ ‘సన్నీ సంస్కారి తులసి కుమారి’ మూవీలో కలిసి నటిస్తున్నారు. శశాంక్ ఖైతాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. లవ్ స్టోరీ నేపథ్యంలో రాబోతుంది.






