- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Surya 47: సూర్య 47లో మరో యంగ్ హీరో కీ రోల్.. వైరల్‌గా పోస్ట్
తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టిన తమిళ స్టార్ సూర్య.. ప్రజెంట్ ‘సూర్య 47’తో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టిన తమిళ స్టార్ సూర్య.. ప్రజెంట్ ‘సూర్య 47’తో బిజీగా ఉన్నాడు. జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి నెట్టింట ఏదో ఒక వార్త సందడి చేస్తూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మరో యంగ్ హీరో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ‘ప్రేమలు’, ‘లోకా’ చిత్రాలతో పుల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో నాస్లెన్.. ఇప్పుడు సూర్య 47లో నటించే అవకాశం దక్కించుకున్నాడట. ఉత్కంఠభరితమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నాస్లెన్ ఓ ఇంపార్టెంట్ పాత్ర పోషించబోతున్నాడని కోలీవుడ వర్గాల నుంచి గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉండగా.. ప్రజెంట్ దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇందులో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2026 నుంచి సూర్య 47 ప్రారంభం కానుంది. లింక్






