కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న యంగ్ హీరో సినిమా.. బాక్సాఫీస్ వద్ద విజయ పరంపర కొనసాగుతోందంటూ ట్వీట్

by I. Sairam |

యంగ్ హీరో రోషన్(Roshan Meka) నటించిన తాజా సినిమా 'ఛాంపియన్'(Champion).

కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న యంగ్ హీరో సినిమా.. బాక్సాఫీస్ వద్ద విజయ పరంపర కొనసాగుతోందంటూ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో రోషన్(Roshan Meka) నటించిన తాజా సినిమా 'ఛాంపియన్'(Champion). ప్రదీప్ అద్వైత్(Pradeep Adhwaith) దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనస్వర రాజన్(Anaswara Rajan) హీరోయిన్‌గా నటించింది. ఇక దీన్ని స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతుంది.

అయితే ఈ సినిమా ఫస్ట్ డే నుంచే మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇందులో భాగంగా ఐదు రోజుల్లోనే రూ.12.51కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘బాక్సాఫీస్ వద్ద విజయ పరంపర కొనసాగుతోంది.. ఛాంపియన్ 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.12.51+ కోట్ల గ్రాస్ వసూలు చేసి సోమవారం సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది.. బ్లాక్ బస్టర్ ఛాంపియన్ ఇప్పుడు సినిమాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story