కన్నప్ప టీమ్‏కు క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో.. ఇకపై అలాంటివి రాకుండా చూసుకుంటామంటూ వీడియో

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-01 05:31:09  IST  )

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), కార్తీక్ రాజు(Karthik Raju) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’(Single).

కన్నప్ప టీమ్‏కు క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో.. ఇకపై అలాంటివి రాకుండా చూసుకుంటామంటూ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), కార్తీక్ రాజు(Karthik Raju) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’(Single). అయితే దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీస్ ఇవానా(Ivana), కేతిక శర్మ(Kethika Sharma)లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్(Vennela Kishore) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrashekhar) సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్‌కు నెట్టింట పాజిటివ్ రివ్యూస్ రాగా.. అందులో శ్రీవిష్ణు చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మంచు విష్ణు, రణబీర్ కపూర్ వరకు ఇలా చాలా మంది హీరోల హిట్ మూవీస్ డైలాగ్స్ వాడేశారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ సైతం చెప్పారు. ఇక చివర్లో మంచు కురిసిపోతుంది అనే డైలాగ్ సైతం వచ్చింది. దీంతో ఈ డైలాగ్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి. తాజాగా ఈ వివాదం పై రియాక్ట్ అవుతూ శ్రీవిష్ణు ఓ వీడియోను షేర్ చేశారు.

“ఇటీవల విడుదలైన సింగిల్ ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో మేం వాడిన కొన్ని డైలాగ్స్ కారణంగా కన్నప్ప టీమ్ హర్ట్ అయ్యిందని తెలిసిందే. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. అది కావాలని మేము ఇంటెన్షల్‌గా చేసింది కాదు.. కానీ తప్పుగా కన్వే అయ్యింది. వెంటనే ఆ డైలాగ్స్ డిలీట్ చేశాం. అవి సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేయలేదు. ప్రస్తుతం జనరేషన్ వాడే మీమ్స్, బయట వైరల్ అయ్యే ఇతర సినిమా రిఫరెన్స్ ఎక్కువగా తీసుకున్నాం.

ఆ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, అల్లు అరవింద్ ఇలా చాలా మంది డైలాగ్స్ ఉపయోగించాము. పాజిటివ్ గానే ఇవన్ని చేశాము. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారి.. సింగిల్ టీమ్ తరపున క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై అలాంటివి రాకుండా చూసుకుంటాము. ఇండస్ట్రీ మొత్తం ఒకే ఫ్యామిలీ. పొరపాటున ఇలాంటివి తప్పుగా అర్థమైనా సారి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


Click For Tweet..

Next Story