నందమూరి హీరోపై యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. జై బాలయ్య అంటున్న ఫ్యాన్స్.. పోస్ట్ వైరల్

by I. Sairam |

‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

నందమూరి హీరోపై యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. జై బాలయ్య అంటున్న ఫ్యాన్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది.

బాబి కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా(urvashi Rautela) ఐటెం సాంగ్‌లో చిందులేసింది. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో ఆస్క్ మి ఎ క్వశ్చన్ అని రాసుకొచ్చింది. దీనికి చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు.

అయితే ఒక నెటిజన్ మాత్రం బాలకృష్ణ నుంచి ఏం నేర్చుకున్నారు అని అడుగగా.. దానికి ప్రగ్యా స్పందిస్తూ..‘డిసిప్లేన్, టైమ్ పంక్చువాలిటీ, సినిమా పై ఉన్న ఇష్టం, రోజూ దాని కోసం అతను 1000 పర్సెంట్ ఇవ్వడం’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇది విన్న నెటిజన్లు జై బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ బ్యూటీ బాలయ్యతో అఖండ, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.




Next Story