బీచ్ ఒడ్డున నిక్కరులో దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నానంటూ పోస్ట్.. మిర్చీ కన్నా నువ్వే హాట్‌గా ఉన్నావని కామెంట్స్

by Gugulothu.Kavitha |

ఒకే ఒక్క సినిమతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) మనందరికీ సుపరిచితమే.

బీచ్ ఒడ్డున నిక్కరులో దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ..  రొమాంటిక్ మూడ్‌లో ఉన్నానంటూ పోస్ట్.. మిర్చీ కన్నా నువ్వే హాట్‌గా ఉన్నావని కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకే ఒక్క సినిమతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) మనందరికీ సుపరిచితమే. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ‘ఒరు అదార్ లవ్’(Oru Adaar Love) చిత్రంలోని ఒక పాటలో కన్ను గీటుతూ కనిపించి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. అలాగే మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంది. ఒక్క రోజులోనే లక్షలాది మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యారు. తెలుగులోనూ చాలా అవకాశాలు తలుపు తట్టాయి. కానీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో అందాల జాతర చేస్తుంది ఈ అమ్మడు.

ట్రెండీ వేర్ డ్రెస్సులలో క్లీన్ బోల్డ్ షో చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రియా వారియర్ తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో సముద్రంలో, సముద్రం ఒడ్డున బ్రాతో పాటు కింద చిన్న బ్లాక్ కలర్ నిక్కరు వేసుకుని థైస్ షో చేసింది. ఇక వాటికి.. ‘నా బ్లూస్‌ను రొమాంటిక్‌గా మార్చడం’ అనే క్యాప్షన్ రాసుకొస్తూ సీతాకోక చిలుక, సముద్రం, శంఖం ఉన్న ఎమోజీలను జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు నువ్వు ఈ డ్రెస్సులో మిర్చి కన్నా హాట్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story