- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫ్ సెంచరీ దాటిన హీరోతో యంగ్ బ్యూటీ రొమాన్స్.. ఇప్పుడున్న క్రేజ్‌లో అవసరమా అంటున్న ఫ్యాన్స్?
యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal).. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal).. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu), ప్రభాస్ (Prabhas) ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఉన్నాయి. ఇక రీసెంట్‌గా ‘వీరమల్లు’ నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో నిధి లుక్‌కు యూత్ మరింత ఎట్రాక్ట్ అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో నిధి వైరల్ బ్యూటీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తుందట ఈ అమ్మడు.
ఇందులో భాగంగా.. 64ఏళ్ల హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయిందట. టాలీవుడ్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు విక్టరీ వెంకటేష్(Venkatesh). ఇక దీంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి ‘రమణ కేరాఫ్ ఆనంద నిలయం’ (Ramana C/o Ananda Nilayam)అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారట. ఇందులో ఇద్దరు హీరోయిన్‌లను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుండగా.. వారిలో ఒకరు నిధి అగర్వాల్ అని టాక్. ఈ సినిమాను 2026 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట.






