- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mardaani-3: రాణిముఖర్జీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలోకి యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ ఎంట్రీ.. హైప్ పెంచేస్తున్న పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణిముఖర్జీ (Rani Mukherjee) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘మర్దానీ-3’

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణిముఖర్జీ (Rani Mukherjee) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘మర్దానీ-3’ (Mardaani-3). అభిరాజ్ మినావాలా (Abhiraj Minawala) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. మర్దానీ ఫ్రాంచైజీ(Mardaani Franchise)లో రాబోతుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు పార్టులు సూపర్ సక్సెస్ అందుకోగా.. మర్దానీ-2 కు సీక్వెల్‌గా వస్తున్న మర్దానీ-3పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో రాణిముఖర్జీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్స్ కూడా సోషల్ మీడియా(Social media) వేదికగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది.
ఆదిత్య చోప్రా (Aditya Chopra) నిర్మిస్తున్న ఈ మూవీ హై ఎక్స్‌పెక్టేషన్స్ (High Expectations) మధ్య వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వినిపిస్తుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ జాంకి బోడివాలా (Janki Bodiwala) కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. ఈ బ్యూటీ ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుండగా.. ఈమెపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు టాక్.
అయితే.. అజయ్ దేవగన్ (Ajay Devgan) నటించిన ‘సైతాన్’ చిత్రంతో బాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను క్రియేట్ చేసుకుంది జాంకి. 2023లో వచ్చిన గుజరాతీ సినిమా ‘వాష్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి వికాస్ బహల్ దర్శకత్వం వహించగా.. ఇందులో మాధవన్ (Madhavan), జ్యోతిక (Jyothika), జాంకి బోడివాలా ప్రధాన పాత్రల్లో నటించారు. 2024లో విడుదలైన ‘సైతాన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకోవడంతో.. తన పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసింది జాంకి బోడివాలా. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ.. మర్దానీ-3లో నటిస్తుందని వార్తలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.






