క్లాసీ లుక్‌లో యంగ్ బ్యూటీ.. తల్లికి ఏమాత్రం తీసిపోని అందం అంటూ కామెంట్స్

by I. Sairam |

అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

క్లాసీ లుక్‌లో యంగ్ బ్యూటీ.. తల్లికి ఏమాత్రం తీసిపోని అందం అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ తెలుగులో కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన ‘దేవర’(Devara) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘పెద్ది’(Peddi) మూవీలో నటిస్తుంది. రామ్ చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాకు ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో స్టార్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar) అలియాస్ శివన్న, దివ్వేంద్(Devend) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది జాన్వీ.

ఈ క్రమంలో తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో లైట్ పింకిష్ కలర్ డ్రెస్ వేసుకుని, మెడలో ముత్యాల హారాలు వేసుకుంది. అయితే ముద్దుగుమ్మ ఇంత అందంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ముస్తాబయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. మీ అమ్మ శ్రీదేవి అందానికి ఏ మాత్రం తీసిపోని అందం నీది కూడా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story