‘కింగ్డమ్’ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న యంగ్ బ్యూటీ.. పోస్ట్ షేర్ చేయడంతో ఆనందంలో ఫ్యాన్స్

by I. Sairam |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న తాజా సినిమా ‘కింగ్డమ్’(Kingdom).

‘కింగ్డమ్’ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న యంగ్ బ్యూటీ.. పోస్ట్ షేర్ చేయడంతో ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న తాజా సినిమా ‘కింగ్డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sre Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ భారీ అంచనాల నడుమ జూలై 31న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్లలో జోరు పెంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు మూవీటీమ్. ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ తన ఎక్స్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఈ సినిమాలో త‌న పాత్ర‌కు సంబంధించిన డ‌బ్బింగ్ పూర్తి చేసుకున్నానని తెలిపింది. అంతేకాకుండా ఆమె డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఒక క్యూట్ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. Link

Next Story