న్యూ బిగినింగ్స్ అంటూ గుడ్ న్యూస్ ప్రకటించిన యంగ్ బ్యూటీ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

by I. Sairam |

‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

న్యూ బిగినింగ్స్ అంటూ గుడ్ న్యూస్ ప్రకటించిన యంగ్ బ్యూటీ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది.

అందులో న్యూ బిగినింగ్స్ అంటూ షూటింగ్ ఫొటోస్ షేర్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల‌్‌గా మారింది. ఇక దీన్ని చూసిన ఫ్యాన్స్ మళ్లీ సినిమాలతో బిజీగా ఉన్నందుకు ఫుల్ ఖుషీగా అవుతున్నారు. కాగా హెబ్బా పటేల్‘థ్యాంక్యూ డియర్’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఇందులో ధనుష్ రఘుముద్రి హీరోగా నటిస్తుండగా.. మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో తోట శ్రీకాంత్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ పిక్స్ ఈ మూవీలోని షూటింగ్‌కి సంబంధించిన ఫొటోస్ అన్నట్లు తెలుస్తోంది.





Next Story