అజిత్ కుమార్ సరసన యంగ్ బ్యూటీ.. వైరల్‌గా మారిన పోస్ట్!

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన కెరీర్‌లో రాబోతున్న 64వ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

అజిత్ కుమార్ సరసన యంగ్ బ్యూటీ.. వైరల్‌గా మారిన పోస్ట్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన కెరీర్‌లో రాబోతున్న 64వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం AK64 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత అజిత్ కుమార్, ఆధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా హైప్ క్రియేట్ అయింది. అంతే కాకుండా యంగ్ అండ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రోమియో పిక్చర్స్ అండ్ వెల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతుండగా.. ఇప్పుడు మరో క్రేజీ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు యంగ్ హీరోయిన్ కాయదు లోహర్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. కథ నచ్చడంతో అమ్మడు మాక్సిమమ్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అయితే.. ఈ వైరల్ న్యూస్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Next Story