- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
తమన్ ఫస్ట్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. (వీడియో)

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) అందరికీ సుపరిచితమే. ఆయన తన మ్యూజిక్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంటారు. అలాగే పలు షోస్‌లోనూ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల ఆయన మ్యూకిర్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ఇక ఆ తర్వాత చేసి బ్యాడ్ స్వ్కేర్, జాట్ మాత్రం కాస్త పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తమన్ ది రాజాసాబ్(The Rajasaab), ఓజీ(og), ఇదయం మురళి(Idhayam Murali) వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించబోతున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, ఓ చిట్‌చాట్‌లో ముచ్చటించిన తమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘‘నేను 1994లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అయితే అప్పుడు నాకు ఓ మూడు కొత్తగా లాంచ్ అయిన 10 రూపాయల నోట్లు ఇచ్చారు. అలాగే బాగా వాయించానని మెచ్చుకున్నారు. అప్పుడు అంత పేమెంట్స్‌ను బ్యాంకు అకౌంట్స్‌లో వేయకపోతుండే. చేతికే డబ్బులు ఇచ్చేవాళ్లు. అయితే నేను చేసిన మొదటి సినిమా ‘భైరవ దీపం’ బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ 9 రోజులపాటు వాయించాను. దీంతో నాకు రూ.270 ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తమన్ రెమ్యునరేషన్ గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు.