David Warner: ‘రాబిన్‌హుడ్’ సినిమాకు డేవిడ్ వార్నర్ నిమిషానికి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలిస్తే ఖంగు తినాల్సిందే?( ట్వీట్)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (nithin) నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ (robinhood).ఈ సినిమాను వెంకీ కుడుముల (venky kudumula) తెరకెక్కిస్తుండగా.. యంగ్ హీరోయిన్ కేతిక శర్మ (ketika sharma) ఐటమ్ సాంగ్ చేస్తోంది.

David Warner: ‘రాబిన్‌హుడ్’ సినిమాకు డేవిడ్ వార్నర్  నిమిషానికి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలిస్తే ఖంగు తినాల్సిందే?( ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (nithin) నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ (robinhood).ఈ సినిమాను వెంకీ కుడుముల (venky kudumula) తెరకెక్కిస్తుండగా.. యంగ్ హీరోయిన్ కేతిక శర్మ (ketika sharma) ఐటమ్ సాంగ్ చేస్తోంది. అయితే నితిన్ సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ (rajendra prasad), వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ(vennela kishor) దేవతత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ మూవీని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ ఎర్నేని (Naveen Erneni), యలమంచలి రవిశంకర్ (Ravi Shankar)భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య ‘రాబిన్‌హుడ్’చిత్రం మార్చి 28న థియేటర్స్‌లోకి రానుంది. ఇక ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ కెప్లెన్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్ రోల్ చేస్తున్నారు. తాజాగా, డేవిడ్ వార్నర్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మూవీ కోసం డేవిడ్ వార్నర్ కేవలం రెండు రోజులు మాత్రమే షూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఆయనది 2నిమిషాల 50 సెకండ్ల నిడివి ఉంటుందని టాక్. ఇందు కోసం డేవిడ్ ఏకంగా 2. 25 కోట్లు అంటే నిమిషానికి ఒక కోటీ తీసుకుంటున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.

Next Story