- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘యుద్ధం ఎక్కడ మొదలు పెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలిసుండాలి’.. ఆసక్తికరంగా యంగ్ హీరో మూవీ టీజర్
టాలీవుడ్ యంగ్ సంగీత్ శోభన్(Sangeet Shoban) మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ సంగీత్ శోభన్(Sangeet Shoban) మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తన నటన, డ్యాన్స్ కామెడీతో జనాలను కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన హీరోగా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సంగీత్ శోభన్ హీరోగా, కేఎస్‌కే చైతన్య(KSK Chaitanya) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘గ్యాంబ్లర్స్’. అయితే ఇందులో ప్రశాంతి చారులింగ(Prasanthi Charulinga)హీరోయిన్‌గా నటిస్తోంది. రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత కీలక పాత్రలో కనిపించనున్నారు. సునీత, రాజ్ కుమార్ బృందావనం అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం థ్రిల్లింగ్, అంశాలు, ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 6న థియేటర్స్‌లో గ్రాండ్ విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘గ్యాంబ్లర్స్’ టీజర్‌ను రిలీజ్ చేశారు. “యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి” అనే డైలాగ్స్‌తో మొదలవ్వగా.. ఇందులో సంగీత్ శోభన్ షాకింగ్ లుక్‌లో కనిపించాడు. ఆ తర్వాత రమేష్, డెవిల్(Devil), సమీర, ముఖేష్(Mukesh), లగ్డీ, పార్థ్ వంటి క్యారెక్టర్స్‌ను పరిచయం చేశారు. పేకాట ఆడేవాళ్లను వదిలిపెట్టొద్దు అని అంటాడు. ఇక గేమ్ ఇప్పుడే మొదలైందంటూ ఎండ్ చేస్తాడు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






