- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pooja Hegde: అవకాశాల కోసం అలా చేయాల్సిందే.. నాకు ప్రతి సినిమా చాలా ముఖ్యం.. పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ‘ఒక లైలాకోసం’ సినిమాతో వచ్చి అనతి కాలంలోనే బుట్టబొమ్మగా గుర్తింపు సంపాదించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ‘ఒక లైలాకోసం’ సినిమాతో వచ్చి అనతి కాలంలోనే బుట్టబొమ్మగా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళ, హిందీ లో పలు చిత్రాల్లో నటించిన ఆమె ఫుల్ పాపులారిటీతో ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇటీవల కాస్త అవకాశాలు తగ్గిపోవడంతో కొద్ది రోజుల పాటు ఖాళీగా ఉన్న ఆమె ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే రెట్రో(Retro), జన నాయగన్(Jana Nayagan), కూలీ(Coolie) వంటి మూవీస్ చేస్తుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘అవకాశాలు ఇస్తుంది ఉత్తరాది లేదా దక్షిణాది అనే తేడా నాకు లేదు. మనకు సినిమా చాన్సులు ఇచ్చేవాళ్ళే ముఖ్యం అని నేను అనుకుంటాను. తక్కువ అవకాశాలు వచ్చిన సమయంలోనూ నేను చాలా కష్టపడి నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. ప్రతి సినిమా నాకు చాలా ముఖ్యం. నా ప్రతి మూవీ నిర్మిస్తూ నీకు మరొక అవకాశం కూడా ఇస్తాను అని చెప్పేవారు నాకు లేరు. అలా అని ప్రతీ సినిమా హిట్ అవుతుందని కాదు. హిట్ అయితే మరొక అవకాశం వస్తుందని ఆవ అంతే.
హిట్ కాకపోతే ఒకసారి అది కెరీర్‌కు బ్రేక్ పడేలా కూడా చేస్తుంది. ఏదైనా వర్కౌట్ అవ్వకపోతే ప్రాజెక్ట్ కోసం మనల్ని మనం మార్చుకోవాలి. నేను బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. నా కొన్ని దక్షిణాది మూవీస్ హిందీ ప్రేక్షకులను చేరుకున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. కాబట్టి మనల్ని ఎవరు చూస్తున్నారో మనకు ఎప్పటికీ తెలియదు. అలాగే మనలోని స్పెషల్ టాలెంట్‌ను ప్రజలు గుర్తిస్తారు. భాష ఏదైనా సరే మంచి పాత్రలను పోషించడమే నా లక్ష్యం. కెరీర్‌లో ఎదిగే క్రమంలో చాలా సినిమాలు నాకు స్పూర్తినిచ్చాయి. అందుకే ఇప్పుడు కథలు, పాత్రలు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.






