మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే.. సునీత గురించి అసలు నిజాలు బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రవస్తి

by Mallepaka Hamsa |

ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన సినీ సెలబ్రిటీలు చిక్కుల్లో పడుతూ రచ్చకెక్కుతున్నారు.

మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే.. సునీత గురించి అసలు నిజాలు బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రవస్తి
X

దిశ, సినిమా: ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన సినీ సెలబ్రిటీలు చిక్కుల్లో పడుతూ రచ్చకెక్కుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ ప్రవస్తి(Pravasthi), సింగర్ సునీత(Sunitha), కీరవాణి(Keeravani)లపై ఆమె చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తనను దారుణంగా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ విషయం సింగర్ సునీత్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ప్రవస్తిని చిన్నప్పుడు ముద్దు చేసినట్లు ప్రస్తుతం చేయలేనని. ఆమె కేవలం సింపతీ కోసమే ఇలా చేస్తుందని అన్నారు. తాజాగా, ఈ విషయం ప్రవస్తి మరో వీడియోను షేర్ చేసి అసలు విషయాలను బయటపెట్టింది. ‘‘సునీత గారిని నేను ఒళ్లో కూర్చోబెట్టుకోమని అడగడం లేదు. కనీసం మనిషికి ఇచ్చే గౌరవం ఇవ్వాలని కోరుతున్నాను. అయితే ఆమె రీల్‌లో ఎంత బాగా మాట్లాడారో రియల్ లైఫ్‌లో ఉంటే బాగుండేది మేడమ్.

అలా చేసి ఉంటే అసలు ఇదంతా జరిగేది కాదు. నేను చిన్నప్పుడు ఎలా పాడేదాన్నో ఇప్పుడు అలా పాడటం లేదని అన్నారు. అది మీ ఓపీనియన్ దానిని నేను గౌరవిస్తాను. సాంగ్ సెలక్షన్ గురించి కూడా అన్నారు.ఇది పక్షపాతం చూపించడం కాదా మేడమ్. మాకు దేనికైతే వీడియో రైట్స్ ఉన్నాయో.. ఆ సాంగ్స్ మాత్రమే ఎంచుకున్నాం. అందులో నుంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చాం. కాబట్టి మీరు చెప్పినట్టుగా నా సాంగ్స్ రిజెక్ట్ చేయడానికి కారణం వీడియో రైట్స్ కాదు. దేని గురించో కూడా చెప్తాను. రాఘవేంద్రరావుగారి స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా.. ఆయన సినిమాల్లోని భక్తి పాటల్లో నేను సాంగ్ సెలెక్ట్ చేసుకుని ప్రొడక్షన్ వాళ్లకి పంపిస్తే.. ఇది ఇవ్వడం కుదరదని చెప్పారు.

కానీ.. వేరే కంటెస్టెంట్‌తో అదే సాంగ్ పాడించారు. ఆమె లిరిక్స్ మర్చిపోయినా కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు. మీరు సైగలు చేసి మరీ పాడించారు. మరి ఇది పక్షపాతం చూపించడం కాదా మేడమ్?? మీరు మీ జడ్జిమెంట్ చెప్పకుండా ఎందుకు సైగలు చేశారనేదానికి కూడా మీరు సమాధానం చెప్పండి. ఇప్పటికీ మీరంటే నాకు గౌరవం ఉంది.. మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటా. జడ్జిమెంట్ విషయంలో నాకు జరిగిన అన్యాయం గురించే నేను మాట్లాడాను. మీకు ఆధారాలతో సహా చూపిస్తున్నాను. నాకు మీరంటే పర్సనల్‌ హేట్ లేదు. ఇప్పటికీ నేను మీ ఫ్యాన్‌నే’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Next Story