నేను ఈ స్థాయికి రావడానికి కారణం మీరే.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో

by Gugulothu.Kavitha |

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టిస్తున్న తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju).

నేను ఈ స్థాయికి రావడానికి కారణం మీరే.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టిస్తున్న తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ కో ప్రొడ్యూస్ చేస్తుంది.

మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈ చిత్రం తాజాగా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వరి 14 న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇందులో భాగంగా నవీన్ పొలిశెట్టి వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఇంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కస్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటదని వాళ్లు డిసైడ్ అయ్యారు.

అయితే నా లైఫ్‌లో నేను కూడా మీలాగా RTC X Roads లో బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసే వాడిని. కానీ ఈ రోజు నా ఫేవరేట్ ఐడల్స్‌తో పాటు నా సినిమా కూడా ఇప్పుడు సంక్రాంతి కి వస్తుంది. ఈ స్థాయికి రావడానికి కారణం మీరే. నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Link

Next Story