- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pragya Jaiswal: నా జీవితంలో అతిపెద్ద వరం నువ్వే.. బాలయ్య బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘మిర్చిలాంటి కుర్రోడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ (Akhanda)చిత్రంతో హిట్ సాధించి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ప్రగ్యా మరోసారి బాలయ్య సరసన ‘డాకు మహారాజ్’(Daaku Maharaj) మూవీలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రగ్యా ‘అఖండ-2’ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఓ వైపు తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూనే ప్రగ్యా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన అందచందాలతో కుర్రకారుకు ట్రీట్ ఇస్తుంది.
ఇదిలా ఉంటే.. నేడు మదర్స్ డే కావడంతో ప్రగ్యా తన తల్లితో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. ‘‘నా జీవితంలోని గొప్ప ప్రేమకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజూ నీ నవ్వుతున్న ముఖంతో మేల్కొనడం నా జీవితంలో అతిపెద్ద వరం. ఇంతకు ముందు ఎప్పుడూ నీతో కలిసి జీవించలేదు. కానీ ఇప్పుడు నేను జీవించాను కాబట్టి అర్థమవుతోంది. ఇన్ని సంవత్సరాలు నువ్వు లేకుండా నేను ఎలా గడిపానో నాకు తెలియదు. నువ్వే అంటే నాకు చాలా ఇష్టం. నా అతిపెద్ద చీర్ లీడర్‌గా ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో కఠినంగా మారి నన్ను హెచ్చరించావు. నా గొప్ప ప్రేరణగా, నా ఆనందంగా, నా నిజంగా, నా స్థిరత్వంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీకు చాలా కృతజ్ఞతలు! నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.






