- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నువ్వు నా డైమండ్.. నీ ప్రపంచం అందంగా ఉండాలంటూ మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi)పలు చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది.

దిశ, సినిమా: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) కూతురు మంచు లక్ష్మి (Manchu Lakshmi)పలు చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియా ద్వారా పలు పోస్టులు పెడుతూ ట్రోల్స్‌ను ఎదుర్కొంటూ ఉంటుంది. ఇక గత కొద్ది రోజుల నుంచి ముంబైలో ఉంటుంది. తాజాగా, మంచు లక్ష్మి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మంచు మనోజ్(Manchu Manoj) కూతురు మొదటి పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమను అంతా బయటపెట్టేసింది. ‘‘నువ్వు పుట్టే ముందుకు నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేపుకున్నాను. కానీ దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో. ఆ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావు. నిన్ను మీ అమ్మనాన్న కంటే ముందు నేను ఎత్తుకున్నాను.
రోజంతా నీతోనే ఉన్నాను. మనిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మాటల్లో అది చెప్పలేను. నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. నేను నీతో అల్లరి చేస్తాను. అయితే నీ ఫస్ట్ బర్త్ డే రోజు చాలా చెప్పాలని ఉంది.. ఆనందంగా ఎదగాలి. నీ ప్రపంచం అందంగా ఉండాలి. నువ్వు మా ఇంటికి వచ్చిన రాణివి. నిన్ను త్వరలో కిడ్నాప్ చేసి ముంబైకి తీసుకెళ్లిపోతాను. ఈ డైమండ్‌కు ఇచ్చినందుకు మనోజ్, మౌనికలకు (mounika) థాంక్యూ’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా మనోజ్ కూతురు దేవసేన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక అది చూసిన వారంతా చాలా క్యూట్‌గా ఉందంటూ ఆ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.






