- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నువ్వు ముసలిదానివైపోతున్నావ్ పెళ్లి చేసుకో..’ హీరోయిన్‌పై నెటిజన్స్ ట్రోల్స్
సాధారణంగా నటీనటులు, సెలబ్రిటీలు వయసు దాటిపోతున్నా సరే ఏమాత్రం లెక్క చేయకుండా బ్యాచిలర్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తుంటారు.

దిశ, సినిమా: సాధారణంగా నటీనటులు చిన్న ఏజ్‌లో పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు. అందులోనూ కొందరు సెలబ్రిటీలు వయసు దాటిపోతున్నా సరే ఏమాత్రం లెక్క చేయకుండా బ్యాచిలర్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తుంటారు. ఈ లిస్ట్‌లో నటి షమితా శెట్టి ఒకరు. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీకి 47 ఏళ్లు ఉండగా.. ఇంత ఏజ్ వచ్చిన పెళ్లి చేసుకోకపోవడంపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి.. షమిత వయసును కించపరుస్తూ.. ‘నువ్వు ముసలిదానివైపోతున్నావ్.. ఒకప్పటిలా లేవు.. సరైన టైమ్‌లో పెళ్లి చేసుకుని ఉంటే ఈపాటికి నీ ఎత్తు పిల్లలు ఉండేవారు’ అంటూ కామెంట్స్ చేశాడు.
దీనిపై స్పందించిన షమిత శెట్టి.. ‘అవును.. కాలంతో పాటు అన్నీ మారుతుంటాయి. అలాగే జీవితంలో వయసు పెరిగేకొద్దీ మార్పులు జరగడం సహజం. అందంతో పాటు ఏదీ శాశ్వతంగా ఉండదు. అయితే ఈ వయసులో కూడా నేను ఎంతో ఫిట్‌గా సంతోషంగా ఉన్నాను. అది ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం. నాకదే చాలు. ఇక పెళ్లి అంటారా.. మీరు పెళ్లి చేసుకుని ఏం సాధించారు? అయినా మీలాంటివారు మాలాంటి ఒంటరి మహిళల్ని ఎందుకు ఫాలో అవుతారు? ఎందుకు ట్రోల్స్ చేస్తారు? మీ పురుషాధిక్య ఆలోచనల్ని మాపై రుద్దడానికా? మమ్మల్ని అవమానించడానికా? దయచేసి మీరు నాకో హెల్ప్ చేయండి.. వెంటనే మీరు నా అకౌంట్‌ను అన్‌ఫాలో చేయండి’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.






