పూజ కార్యక్రమాలతో లాంచ్ అయిన యోగి బాబు - సత్య సినిమా

by Pulgam srinivas |

సత్య - యోగి బాబు - పవన్ బాసంశెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా జరిగాయి.

పూజ కార్యక్రమాలతో లాంచ్ అయిన యోగి బాబు - సత్య సినిమా
X

దిశ, వెబ్ డెస్క్: అద్భుతమైన క్రేజ్ కలిగిన కమెడియన్లు సత్య, యోగి బాబు ప్రధాన పాత్రల్లో పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుందనే వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా పూర్తయ్యాయి. ఈ సినిమాలో సత్య, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించనుండగా, ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించనున్నాడు. పవన్ సీఎచ్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని నవయువ చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రంగబలి’ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోకపోయినా అందులోని కామెడీ సన్నివేశాలు మాత్రం మంచి వినోదాన్ని పంచాయి. దీంతో పవన్ బాసంశెట్టి పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌పై ఫోకస్ పెట్టడం, అందులో సత్య, యోగి బాబు వంటి టాలెంటెడ్ నటులు భాగం కావడం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో పవన్ మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story