- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీమేల్ డైరెక్టర్స్ తీస్తే సినిమా టోటల్‌గా మారిపోతుంది.. స్టార్ హీరో వైరల్ కామెంట్స్
యశ్ తన కొత్త మూవీ ‘టాక్సిక్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూ.. వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు.

దిశ, సినిమా: యశ్ తన కొత్త మూవీ ‘టాక్సిక్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూ.. వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే ‘టాక్సిక్’ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌తో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. ‘ఒక మహిళా దర్శకురాలి కింద పనిచేయడం సినిమాకు పూర్తిగా కొత్త ఎమోషనల్ డెప్త్ తెచ్చింది. మగవాళ్లు, ఆడవాళ్లు పరిస్థితులను వేర్వేరుగా చూస్తారు. ఆ మార్పే కథకు కొత్త లేయర్లు యాడ్ చేసింది. మేము జీవితాన్ని ఒకలా చూస్తాం, కానీ మహిళలు ఎమోషన్స్, రియాక్షన్స్, చిన్న చిన్న వివరాలను గమనిస్తారు. మాకు ముఖ్యం కానివి వాళ్ల దృష్టిలో కథకు గుండె లాంటివి అవుతాయి. ఈ ఎక్స్‌పీరియన్స్ వల్ల కథ మరింత రిచ్‌గా, డీప్‌గా, అందరికీ కనెక్ట్ అయ్యేలా మారింది. ఫిమేల్ ఫిల్మ్‌మేకర్ తీసుకొచ్చే సెన్సిటివిటీ సాధారణ సీన్స్‌ను కూడా పవర్‌ఫుల్ మూమెంట్స్‌గా మారుస్తుంది. గీతూ మోహన్ దాస్ కారణంగానే టాక్సిక్‌కు కొత్త సోల్ వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.






