- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీలక ప్రకటన విడుదల చేసిన యష్ రాజ్ ఫిల్మ్స్.. ‘సయారా’ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్
బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించి లాభాలు పొందింది.

దిశ, సినిమా: బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించి లాభాలు పొందింది. 1970లో యష్ చోప్రా(Yash Chopra) స్థాపించిన ఈ బ్యానర్‌పై తెలుగు, హిందీ సినిమాలు రావడంతో పాటు ఘన విజయాలు సాధిస్తున్నాయి. అయితే దీనిని 2012 నుంచి యష్ కుమారుడు ఆదిత్య చోప్రా(Aditya Chopra) నేతృత్వంలో నడుస్తోంది. తాజాగా, యష్ రాజ్ ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. తమ బ్యానర్‌పై ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘సయారా’(Saiyaara) సినిమా రాబోతున్నట్లు తెలుపుతూ నటీనటులకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. మోహిత్ సూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా,అక్షయ్ విధాని నిర్మిస్తున్నారు.
వీరిద్దరి కాంబోలో రాబోతున్న మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇక ఈ సినిమా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఇందులో అనన్య పాండే తమ్ముడు అహాన్ పాండే(Ahaan Panday) హీరోగా నటిస్తుండగా.. అనీత్ పెద్ద హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ అమ్మడు విషయానికొస్తే.. మోడల్ అయినప్పటి పలు యాడ్స్‌లో నటించింది. అనీత్ నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘సలామ్ వెంకీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఈ భామ ‘బిగ్ గర్ల్స్ డోంగ్ క్రై’ అనే సిరిస్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. పంజాబీ అయిన అనీత్ పేటియం ప్రకటన ద్వారా మంచి గుర్తింపు రావడంతో హీరోయిన్‌గా మారింది. నిత్యం ఈ అమ్మడు సోషల్ మీడియాలో పలు ఫొటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఓ పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం.
YRF - MOHIT SURI INTRODUCE TWO NEW TALENTS IN INTENSE LOVE STORY 'SAIYAARA' – RELEASE DATE LOCKED... #YRF and #MohitSuri join forces for the very first time to present an intense love story titled #Saiyaara.
— taran adarsh (@taran_adarsh) April 22, 2025
Presented by #AdityaChopra and directed by #MohitSuri, #Saiyaara… pic.twitter.com/881etni8T9






