- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖాకీ డ్రెస్‌లో కిర్రాక్ అనిపిస్తున్న యాంకరమ్మ.. లేటెస్ట్ పిక్స్ వైరల్
ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్స్‌లో గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించే ముద్దుగుమ్మ స్రవంతి చొక్కారపు ఒకరు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్స్‌లో గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించే ముద్దుగుమ్మ స్రవంతి చొక్కారపు ఒకరు. ఆమె తన అందంతో పాటు చలాకీతనంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇక ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. ఇక ఈ జంటకు ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఓ రేంజ్‌లో ఉంటుంది.
కేక పుట్టించే అందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా స్రవంతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఖాకీ డ్రెస్‌లో కిర్రాక్ ఫొటోస్‌కి పోజులిచ్చింది. లాఠీ పట్టుకుని కళ్లకి నల్ల కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్ లుక్స్‌లో అలరించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మేము మీకు సరెండర్ అవుతాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






