ప్రేమికుల రోజున సరికొత్త ప్రేమ కథ

by Sujitha Rachapalli |

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి.

ప్రేమికుల రోజున సరికొత్త ప్రేమ కథ
X

దిశ, సినిమా : ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. ఆయన గతంలో రూపొందించిన ‘ఉత్తర’, ‘ఆర్టిస్ట్’ సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తన మూడో చిత్రంగా హీరోయిన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో చాలా స్పెషల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90's హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్‌ను ఇటీవల సంక్రాంతి పండుగ శుభకాంక్షలతో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఈ సిస్టమ్, సొసైటీలో జరిగే ప్రేమ కథతో మూవీ రూపొందుతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడైంది. ఫిబ్రవరి 14న టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Next Story