యాలో ఈ గుబులే ఏలో.. ఆకట్టుకుంటున్న నేషనల్ అవార్డ్ విన్నర్ సాంగ్

by Sujitha Rachapalli |

అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్.. ప్రస్తుతం మైథలాజికల్ జానర్‌లో రూపొందుతున్న ‘త్రికాల’ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

యాలో ఈ గుబులే ఏలో.. ఆకట్టుకుంటున్న నేషనల్ అవార్డ్ విన్నర్ సాంగ్
X

దిశ, సినిమా : అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్.. ప్రస్తుతం మైథలాజికల్ జానర్‌లో రూపొందుతున్న ‘త్రికాల’ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా ‘యాలో ఈ గుబులే ఏలో’ పాటని రిలీజ్ చేశారు. ఈ పాటలో హర్షవర్దన్ రామేశ్వర్ స్టైల్‌తో పాటు మెలోడీకి ఉన్న డెప్త్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. ఆయన మ్యూజిక్ ట్రీట్ ఈ పాటకి ప్రధాన బలం. కాగా ప్రతి బీట్‌లోనూ ఆయన ట్రేడ్‌మార్క్ ఇంటెన్సిటీ స్పష్టంగా వినిపిస్తూ... పాటకి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఇచ్చింది. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకి ప్రాణం పోసింది. రాకేందు మౌళి లిరిక్స్ క్యాచిగా ఉన్నాయి. కాగా రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సినిమాలో సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు

Next Story