తమన్నాపై కర్ణాటక ఎంపీ హాట్ కామెంట్స్.. కన్నడ రాదంటూ !

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాపై కర్ణాటక ఎంపీ కృష్ణదత్త ఒడేయర్ ( Yaduveer Wadiyar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తమన్నాపై కర్ణాటక ఎంపీ హాట్ కామెంట్స్.. కన్నడ రాదంటూ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాపై కర్ణాటక ఎంపీ కృష్ణదత్త ఒడేయర్ ( Yaduveer Wadiyar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ తమన్నాకు ( Tamannaah Bhatia) కన్నడ భాష రాదంటూ... ర్యాగింగ్ చేశారు. ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా అసలు వద్దంటూ.. కర్ణాటక ఎంపీ కృష్ణదత్త ఒడేయర్ డిమాండ్ చేశారు. ఆమెను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా మైసూర్ శాండల్ సబ్బులకు ( Mysore sandal soaps ) , శ్రీ గంధముకు హీరోయిన్ తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా కర్ణాటక సర్కార్ నియామకం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై రెండు రోజుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమన్నాకు, కర్ణాటక కు ఏమాత్రం సంబంధం లేదని... లోకల్ హీరోయిన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయాన్ని బిజెపి పార్టీ నేతలు తెరపైకి తీసుకువస్తున్నారు.

ఇక తాజాగా.. ఎంపీ కృష్ణదత్త ఒడేయర్ ఈ అంశంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ పూర్వికుడు కృష్ణరాజు ఒడేయర్ 1916లో పెట్టిన మైసూర్ కంపెనీకి పరభాష నటులను అంబాసిడర్ గా పెట్టడం ఏంటి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కన్నడ భాష రాని వారికి, కర్ణాటక సంస్కృతి అలాగే సంప్రదాయం తెలియని వారిని రూ. 6.2 కోట్లు పెట్టి అంబాసిడర్‌గా పెట్టడం ఏంటంటూ కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story