- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ సుకుమారి నుంచి యాదగిరి ఫస్ట్ లుక్ రిలీజ్.. హోమ్లీ లుక్‌లో ఆకట్టుకుంటున్న హీరో
తిరువీర్(Thiruveer), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) జంటగా నటిస్తున్న విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ! సుకుమారీ’(Oh Sukumari).

దిశ, వెబ్‌డెస్క్: తిరువీర్(Thiruveer), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) జంటగా నటిస్తున్న విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ! సుకుమారీ’(Oh Sukumari). భరత్ దర్శన్(Bharath Darshan) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. తాజాగా రిపబ్లిక్ డే స్పెషల్‌గా నేడు హీరో తిరువీర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఓ సుకుమారి నుంచి యాదగిరిని పరిచయం చేస్తున్నాము.. మీరు పెద్ద తెరపై కనిపించేలా చేసే పాత్ర.. త్వరలో పెద్ద తెరపైకి తీసుకు రావడానికి ఎదురు చూస్తున్నాను’ అనే క్యాప్షన్ జోడించారు. ఇక పోస్టర్‌లో తిరువీర్ పల్లెటూరి అబ్బాయిలా లుంగీ మోకాళ్ల వరకు కట్టుకొని, జబ్బల బనీన్ వేసుకుని, మెడ చుట్టూ టవల్ వేసుకుని నోట్లో బ్రష్ పెట్టుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం హోమ్లీ లుక్‌లో ఉన్న హీరో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






