'రాకా' గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన రైటర్ నాగేంద్ర కాశీ

by Pulgam srinivas |   (  Updated:2026-05-30 06:15:03  IST  )

‘రాకా’ ఇండియన్ సినిమాల్లో ఓ ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుందని రైటర్ నాగేంద్ర కాశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాకా గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన రైటర్ నాగేంద్ర కాశీ
X

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’పై ప్రముఖ రచయిత నాగేంద్ర కాశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ‘రాకా’ ఇండియన్ సినీ చరిత్రలో ఓ ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేను ప్రతిరోజూ షూటింగ్ సెట్‌లో ఉంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం లేకుండానే సెట్లో ఓ అద్భుతమైన ఫీల్ కలుగుతోంది. అదే ఈ సినిమా స్థాయిని తెలియజేస్తోంది.

అట్లీ గారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. అల్లు అర్జున్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు. ఇక భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తమిళ స్టార్ హీరో అజిత్ తల్లి కన్నుమూత

Next Story