- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వావ్.. సూపర్ లుక్‌లో అక్కడ దర్శనమిచ్చిన చైతన్య- శోభిత.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు.

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన స్టార్ హీరోయిన్ సమంత(Samantha)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ పట్టుమని ఫోర్ ఇయర్స్ కలిసి ఉండలేక విడాకులు(Divorce) తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి సమంత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడి సినిమాలకు దూరం అయింది.
అంతే కాకుండా ప్రజెంట్ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. కానీ నాగ చైతన్య డివోర్స్ తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Sobhitha Dhulipala)తో డేటింగ్లో ఉంటూ 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీరికి సంబంధించిన ఓ వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది. తాజాగా చైతన్య- శోభితలు స్టోర్ ఓపెనింగ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
అక్కడ ఉన్న స్టాఫ్‌తో కాసేపు ముచ్చటించిన ఈ జంట ఆ తర్వాత బయటకు వచ్చారు. అలా చాలా క్యూట్ లుక్‌లో ఇద్దరూ చాలా బాగున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) రీసెంట్గా తండేల్ సినిమాతో మన ముందుకు వచ్చాడు.
సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. అయితే విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అలాగే కలెక్షన్ల సునామీ కూడా సృష్టించింది.






