- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాబిన్‌హుడ్’ సినిమాకు డేవిడ్ వార్నర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీలీల(SreeLeela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీలీల(SreeLeela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘భీష్మ’ సాలిడ్ హిట్ కావడంతో అందరికీ ‘రాబిన్‌హుడ్’ పై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై రవిశంకర్, నవీన్ ఎర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యునిక్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ‘రాబిన్‌హుడ్’ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో.. ఈ మూవీలో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుసుకున్న క్రికెట్ అభిమానులు, సినీ లవర్స్ అంతా ఖుషీ అవుతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ నటనపై ఇంట్రెస్ట్‌తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు పాటలకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగులో ఓ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా, డేవిడ్ వార్నర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘రాబిన్‌హుడ్’ మూవీలో ఓ చిన్న పాత్రలో నటించినందుకు ఆయన రూ.50 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఆయన డిమాండ్ చేయనప్పటికీ మూవీ మేకర్స్ డేవిడ్‌కు క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్లు టాక్. ఆయన మాత్రం సరదా కోసమే చేస్తున్నానని చెప్పారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీని గురించి తెలుసుకున్న వారంతా అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఏంటని షాక్ అవుతున్నారు.






