NTR: జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వరల్డ్ కప్‌.. ఆయన రియాక్షన్ ఇదే! (పోస్ట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-05 11:41:43  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ‘ఆర్ఆర్ఆర్’(RRR) మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

NTR: జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వరల్డ్ కప్‌.. ఆయన రియాక్షన్ ఇదే! (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ‘ఆర్ఆర్ఆర్’(RRR) మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్(Ram Charan) కూడా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రం ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఇందులోని నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కించుకోవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మాత్రం ఈ పాట మార్మోగిపోయింది.

ఈ సాంగ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనడంలో అతిశయోక్తి లేదు. గత కొద్ది రోజులనుంచి ఇన్‌స్టా రీల్స్ కూడా ఆ పాటకు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ పాటను ఫేడరేషన్ ఆఫ్ ఫుల్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) తన అధికారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇందులో ముగ్గురు ఫుల్ బాల్ దిగ్గజాల పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ పేరుతో ఓ స్పెషల్ పోస్టర్‌ను రెడీ చేసి నెట్టింట పెట్టడంతో నిమిషాల్లో సోషల్ మీడియాను షేక్ చేసింది.

అయితే ఇందులో ఫుల్ బాల్ దిగ్గజాలు నేయ్‌మార్, టెవెజ్, రోనాల్డో ఉండటంతో పాటు నాటు నాటు స్టెప్ వేస్తున్నట్లుగా కనిపించారు. ఇక అది చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తూ పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ పోస్టర్‌పై జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అవడం విశేషం. ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో అంతా ఖుషీ అవుతున్నారు. కాగా, ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘దేవర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం దేవర-2, వార్-2 వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్స్ పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు.

Next Story