బిగ్​బాస్​ సీజన్ 7కు రష్మి అంత అడుగుతుందా

by Disha Web Desk 15 |
బిగ్​బాస్​ సీజన్ 7కు రష్మి అంత అడుగుతుందా
X

దిశ, వెబ్​డెస్క్​ : తెలుగు సినీ ప్రియులకు, టీవీ అభిమానులకు రష్మి అంటే తెలియని వారుండరు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈమె ఇటీవల విడుదల చేసిన హాట్​ ఫొటోలకు యువత అల్లాడిపోయారు. అసలు విషయం ఏమిటంటే రష్మి గౌతమ్‌కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ భామకు బిగ్ బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చిందని.. అయితే రెమ్యూనరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఈ సారి హోస్ట్‌గా రానా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో పాల్గోనేందుకు రష్మి గౌతమ్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. మామూలుగా రష్మి గౌతమ్ ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. దీంతో దీనికి తగ్గట్లుగా పారితోషికం కావాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో షో నిర్వాహకులు కాస్త ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయినా ఈ అమ్మడు మాత్రం తగ్గేదే లేదు అంటుందంట. ఆఖరికి మరి రష్మికి బిగ్​బాస్​లో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి.

Next Story

Most Viewed