- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవితేజ బ్యూటీతో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని..? నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ, లవ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అలాగే లవర్ బాయ్‌గా యూత్‌గా క్రష్ అయిపోయాడు. ఇప్పటికీ అమ్మాయిల క్రష్ లిస్ట్‌లో ఈ హీరో ప్లేస్ ఫస్ట్ వరుసలోనే ఉందని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అయితే ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈ హీరోకి అనుకున్నంతగా స్టార్ డమ్ రాలేదు. చివరిగా నటించిన ‘స్కంద’(Skanda) మూవీ కూడా ఆశించినంత హిట్ కాకపోవడంతో ప్రజెంట్ భారీ విజయం కోసం ఫుల్ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో రామ్ పోతినేని ‘రాపో-22’(Rappo-22) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో బ్యాచిలర్ హీరోల లిస్ట్‌లో ముందుగా రామ్ పోతినేని ఉంటాడు. ఈ యంగ్ హీరో దాదాపు 40 ఏళ్ల వయసుకు దగ్గరలోనే ఉన్నాడు. పెళ్లెప్పుడు చేసుకుంటావంటూ ఫ్యాన్స్ అడుగుతుంటే మాట దాటేస్తూ వస్తున్నాడు. ఆ మధ్య రామ్ పెళ్లిపీటలు ఎక్కుతున్నాడంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి కానీ.. అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఇక అప్పుడప్పుడు రామ్ పెళ్లి వార్తలు, ప్రేమ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో రామ్ యంగ్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ ఓ రూమర్ నెట్టింట షికారు చేస్తుంది. అయితే ఈసారి పక్కాగా ప్రేమలో ఉన్నాడని అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదండోయ్.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Bhorse). ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ బ్యూటీ. ఎందుకో తెలియదు కానీ ఈ బ్యూటీతో కనెక్ట్ అయ్యాడట రామ్. దీంతో పరిచయం అయిన చాలా తక్కువ టైమ్ లోనే ఘాడంగా ప్రేమించుకుంటున్నారట ఈ జంట.
ముంబయ్‌లో ఉంటూ తెగ డేటింగ్ చేసుకుంటున్నారట. రామ్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుండటంతో ఇక వీరు ప్రేమలో మునిగిపోయారంటున్నారు. కాగా ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా అందంగా, క్యూట్‌గా ఉంటుంది. తెలుగులో ఒక్క సినిమా చేసినా.. అది ఫ్లాప్ అయ్యింది. కానీ ఈమె గ్లామర్‌కు టాలీవుడ్ ఫిదా అయ్యింది. ఇక రామ్‌తో ఈమె నిజంగానే ప్రేమలో ఉందా..? లేక ఇవి కూడా పుకార్లేనా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఏదీ ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






