మీనాక్షి చౌదరిని వారు వదలరా.. ఏకంగా నాలుగోసారి

by Pulgam srinivas |

మీనాక్షి చౌదరి ఇప్పటివరకు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో గుంటూరు కారం, లక్కీ భాస్కర్, అనగనగా ఒక రాజు చిత్రాలలో నటించింది. ఈ బ్యానర్ వారు కార్తీతో చేయబోయే సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మీనాక్షి చౌదరిని వారు వదలరా.. ఏకంగా నాలుగోసారి
X

దిశ, వెబ్ డిస్క్ : సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక బ్యానర్లో ఒక హీరో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు అంటే, వారి బ్యానర్లో మరికొన్ని సినిమాలు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఒకే బ్యానర్లో హీరోయిన్లు కూడా ఒకటి, రెండు సినిమాలు నటించడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఒక హీరోయిన్ మాత్రం ఒకే బ్యానర్లో వరుసగా సినిమాలు చేస్తుంది. ఇప్పటివరకు తక్కువ కాలంలోనే ఆ నటి ఒక బ్యానర్లో మూడు సినిమాలు చేస్తే, మూడు విజయాలను సాధించాయి.

ఇక ఆ హీరోయిన్ అదే బ్యానర్లో నాలుగవ సినిమా కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు మీనాక్షి చౌదరి. ఈమె సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వరుసగా సినిమాలు చేస్తుంది. మొదటగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఈ బ్యూటీ 'గుంటూరు కారం' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి సక్సెస్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఈమెది చిన్న పాత్ర. ఆ తర్వాత ఈమె ఇదే బ్యానర్లో 'లక్కీ భాస్కర్' అనే చిత్రంలో నటించింది. ఇది సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

అలాగే ఇందులోని మీనాక్షి పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈమె ఈ బ్యానర్లో 'అనగనగా ఒక రాజు' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ఈ సంక్రాంతికి విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఇలా ఇప్పటికే ఈ బ్యానర్లో మూడు సినిమాల్లో నటించి మూడింటితో విజయాలను అందుకున్న ఈ హీరోయిన్కి ఇదే బ్యానర్లో నాలుగో అవకాశం కూడా దక్కే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సితార సంస్థ వారు కార్తీతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం భాగ్యశ్రీ బోర్సే మరియు మీనాక్షి చౌదరిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి మీనాక్షి ఈ సినిమాలో భాగం అయితే, నాలుగోసారి ఈ బ్యూటీ సితార బ్యానర్లో నటించినట్లు అవుతుంది.

Next Story