‘అఖండ 2'లో బిగ్ సర్‌ప్రైజ్.. ఏంటో తెలిస్తే ఫ్యాన్స్‌కి పునకాలే!?

by Jakkula.Mamatha |

టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం ‘అఖండ 2’. ఈ మూవీ రేపు(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

‘అఖండ 2లో బిగ్ సర్‌ప్రైజ్.. ఏంటో తెలిస్తే ఫ్యాన్స్‌కి పునకాలే!?
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం ‘అఖండ 2’. ఈ మూవీ రేపు(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, డైరెక్టర్ బోయపాటి శ్రీను, సీనియర్ నటుడు బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అఖండ 2 మూవీకి సంబంధించి ఏ చిన్న విషయమైన వైరల్ అవుతుంది. ఈ తరుణంలో తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ చిత్రంలో బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అయితే ఆ పాత్ర ఏంటనే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఆ సస్పెన్స్‌కు డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. ‘అఖండ 2’లో తన కుమారుడు వర్షిత్ ‘భక్త ప్రహ్లాదుడు’గా కనిపించనున్నాడని బోయపాటి శ్రీను ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను సినిమాలో నటిస్తున్నట్లు వర్షిత్ చెప్పినప్పటికీ, పాత్ర వివరాలు చెప్పలేదు. సినిమా ట్రైలర్‌ను జాగ్రత్తగా గమనిస్తే ప్రహ్లాదుడి గెటప్‌లో ఉన్న బాలుడిని చూడవచ్చని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.

Next Story