- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sandeep Reddy Vanga: ఆ హీరోయిన్‌తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలని ఉందంటున్న సందీప్ రెడ్డి వంగా
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా దూసుకుపోతున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా దూసుకుపోతున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. 2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన ఈయన.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని.. టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత బాలీవుడ్ ‘యానిమల్’ మూవీ తెరకెక్కించి మరో సంచనలం సృష్టించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివర్లో ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్ నేచురల్ బ్యూటీ సాయిపల్లవితో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలని ఉందంటూ తెలిపాడు. ‘నాకు లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలని ఉంది. అందులో హీరో అనే పాత్ర ఉండకూడదు. హీరోయిన్ ప్రధాన పాత్రలో ఉంటుంది. అయితే ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం నాకు సాయి పల్లవితో తీయాలని ఉంది’ అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సాఫ్ట్ (సాయిపల్లవి) Vs యాక్షన్ (సందీప్ రెడ్డి వంగా) కాంబో ఎలా ఉంటుందో మాకు కూడా చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్






