"ప‌రాశ‌క్తి" సినిమాకు చిక్కులు..బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-13 09:41:41  IST  )

శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమా వివాదంలో చిక్కుకుంది.

ప‌రాశ‌క్తి సినిమాకు చిక్కులు..బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సంక్రాంతి బరిలో నిలిచిన మరో సినిమా పరాశక్తి ( Parasakthi ). శివ కార్తికేయన్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళ్తోంది. సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1965 సంవత్సరంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో వచ్చిందట. ఇక ఈ సినిమాలో జయం రవి, దగ్గుబాటి రానా ప్రత్యేక పాత్రల్లో కనిపించారు.

వివాదంలో పరాశక్తి.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు

శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను వెంటనే బ్యాన్ ( Parasakthi film ban )చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ కొన్ని సీన్స్ ఉన్నాయట. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ఇందిరాగాంధీని అవమానించేలా కూడా సీన్స్ పెట్టారని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

తమిళనాడు ప్రజలు అంటే ఇందిరాగాంధీకి అస్సలు పడదు అనే అర్థం వ‌చ్చేలా సినిమా తీసినట్లు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే ఈ మూవీపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై చిత్ర బృంద సభ్యులు స్పందించినట్లు తెలుస్తోంది. అప్పట్లో జరిగిన అంశాలనే సినిమాలో పొందుపరచామని, ఎవరినీ కించపరచలేదని చెబుతున్నారట.

Read More..

The RajaSaab: త‌గ్గ‌ని ప్ర‌భాస్ జోరు..రూ.200 కోట్లు క్రాస్‌

ఈ సినిమాతో నా అసలైన ప్రయాణం మొదలైంది.. నటిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది: శ్రీలీల

Next Story