ఈ సినిమాతో నా అసలైన ప్రయాణం మొదలైంది.. నటిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది: శ్రీలీల

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-13 09:40:38  IST  )

నటి శ్రీలీల(Sreeleela) ఇటీవల ‘పరాశక్తి’ (Parashakti)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాతో నా అసలైన ప్రయాణం మొదలైంది.. నటిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది: శ్రీలీల
X

దిశ, సినిమా: నటి శ్రీలీల(Sreeleela) ఇటీవల ‘పరాశక్తి’ (Parashakti)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివకార్తికేయన్(Sivakarthikeyan), సుధా కొంగర కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. వచ్చి బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ కొన్ని సీన్లు వివాదానికి దారితీస్తున్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘పరాశక్తి’ మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న శ్రీలీల ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఇప్పటివరకు, నా పాటలు, డ్యాన్స్‌లపై ఎక్కువగా ప్రశంసలు వచ్చేవి. కానీ ఈసారి, నా నటనకు సత్కారం లభించడం నిజంగా ఆనందంగా ఉంది. ‘పరాశక్తి’ నా కెరీర్‌లో ఒక పరిపూర్ణమైన మొదటి చిత్రం లాంటి అనుభూతిని ఇస్తోంది. ఇది నా భవిష్యత్ ప్రయాణానికి బలమైన పునాదిని వేస్తోంది. గతంలో ప్రజలు ఎక్కువగా నా పాటలు, డ్యాన్స్‌లకే ప్రశంసలు ఇచ్చేవారు.

కానీ ఈ సారి భిన్నంగా అనిపిస్తుంది. ఇది నటిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన కొద్దీ, చాలా మంది ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టడం గమనించాను. అది నా హృదయాన్ని తాకింది. ఇది నా సినిమా రంగంలో ప్రారంభాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది.ఈ సినిమా కోసం నేను చేసిన రియలిస్టిక్ ఎమోషనల్ కౌంచింగ్, డైలాగ్ ప్రాక్టీస్, సీన్ల కోసం తీసుకున్న టైమ్ అన్ని ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చాయి. ఇప్పుడు నా కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. భవిష్యత్‌లో మరిన్ని సినిమాల్లో, వివిధ రకాల పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆశతో ఉన్నాను’’ అని ఎమోషనల్ అయింది. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన శ్రీలీల కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తోంది. సూటింగ్ దశలో ఉండగా.. త్వరలో విడుదల కానుంది.


READ MORE .....

"ప‌రాశ‌క్తి" సినిమాకు చిక్కులు..బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్ !

Next Story