The RajaSaab: త‌గ్గ‌ని ప్ర‌భాస్ జోరు..రూ.200 కోట్లు క్రాస్‌

by velandi.Saikiran |   (  Updated:2026-01-13 07:38:21  IST  )

ది రాజా సాబ్ సినిమా రూ.201 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.

The RajaSaab: త‌గ్గ‌ని ప్ర‌భాస్ జోరు..రూ.200 కోట్లు క్రాస్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కామెడీ, హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ది రాజా సాబ్ సినిమా రిలీజ్ అయింది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు కూడా పడిపోయాయి. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.201 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభాస్ పోస్టర్ కూడా వదిలింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ జోడించడంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయట.

ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ రొమాన్స్‌

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ లో ముగ్గురు హీరోయిన్లు న‌టించిన సంగ‌తి తెలిసిందే. నాన‌మ్మ‌, తాత, మ‌న‌వ‌డు చుట్టూ తిరిగిన ఈ క‌థ‌లో రిద్ది కుమార్‌, నిధి అగ‌ర్వాల్, మాళ‌విక మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ ముగ్గురు భామ‌ల‌తో ప్ర‌భాస్ చేసే, రొమాన్స్ సినిమా హైప్ ను పెంచేస్తుంది. అటు స‌త్య‌, స‌ప్త‌గిరి కామెడీ కూడా బాగుంటుంది.

Read More..

"మన శంకర వరప్రసాద్ గారు" ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే ?

Next Story