Ustaad Bhagat Singh: డబ్బింగ్ విషయంలో 'పవన్'కు ఎందుకంత ఆసక్తి

by Pulgam srinivas |

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ పనులను ప్రారంభించి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమాలో అనేక డైలాగులు ఉండడం వల్ల ఈ మూవీ డబ్బింగ్ పనులు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

Ustaad Bhagat Singh: డబ్బింగ్ విషయంలో పవన్కు ఎందుకంత ఆసక్తి
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ మూవీని స్టార్ట్ చేసిన తర్వాత పవన్ రాజకీయాల వైపు కాస్త ఎక్కువ ఆసక్తిని చూపించాడు. దానితో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్ర షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా దర్శకుడు అయిన హరీష్ శంకర్ ఆ గ్యాప్ లో రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీని రూపొందించాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల అయ్యి చాలా రోజులు అవుతుంది.

ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఈనెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించాడు. పవన్ దాదాపుగా తన సినిమా డబ్బింగ్ పనులను చాలా వేగంగా పూర్తి చేస్తూ ఉంటాడు. దానితో ఈ మూవీ డబ్బింగ్ పనులను కూడా స్పీడ్ గా కంప్లీట్ చేస్తాడు అని చాలామంది భావించారు. కానీ ఇప్పటికీ కూడా పవన్ ఈ సినిమాకి డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది.

అలా ఆయన అంతలా ఈ సినిమా డబ్బింగ్ కి సమయం కేటాయించడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో అనేక డైలాగ్ లు ఉన్నట్లు, అవి అద్భుతంగా ఉన్నట్లు, దానివల్ల ఆయన ప్రతి డైలాగ్ అద్భుతంగా రావాలి అనే తపనతో డబ్బింగ్ చెబుతున్నట్లు అందుకే కాస్త సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా కనిపించనుండగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్, తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Next Story