‘తిమ్మరాజుపల్లి టీవీ’ విషయంలో కిరణ్ అబ్బవరం ఎందుకు ఆ తప్పు చేసాడు.

by Pulgam srinivas |

తిమ్మరాజుపల్లి టీవీ చిత్రంపై మంచి అంచనాలు ఉండడంతో, ప్రీమియర్ షోలను ప్రదర్శించి ఉంటే సినిమాకు మరింత హైప్ వచ్చేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి

‘తిమ్మరాజుపల్లి టీవీ’ విషయంలో కిరణ్ అబ్బవరం ఎందుకు ఆ తప్పు చేసాడు.
X

దిశ, వెబ్ డెస్క్: అంతా కొత్తవాళ్లతో నటుడు కిరణ్ అబ్బవరం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను నిర్మించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో సాయి తేజ హీరోగా నటించగా, వేద జలంధర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని రేపు, అనగా ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రం నుంచి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ అద్భుతంగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా ఏదైనా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడితే, ఆ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలను చిత్ర విడుదలకు ముందు రోజు పెద్ద ఎత్తున ప్రదర్శించడం ఆనవాయితీగా మారింది. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడంతో, ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలను కూడా ఈరోజు సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శిస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు లేనట్టేనని స్పష్టమైంది. దీనిపై కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను అద్భుతమైన రీతిలో నిర్వహించి సినిమాను జనాల వరకు తీసుకువెళ్లాడు. ఒకవేళ నిజంగానే సినిమాలో మంచి కంటెంట్ ఉండి ఉంటే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలను ప్రదర్శించాల్సిందని, దాని ద్వారా మంచి టాక్ వస్తే అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చేవని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, రేపు ఈ చిత్రానికి గనుక మంచి టాక్ వస్తే, ఈ మూవీ భారీ కలెక్షన్లను అందుకునే అవకాశాలు చాలావరకు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story