- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి.. బిగ్ బాస్ విన్నర్ ఎమోషనల్ పోస్ట్
‘గోరింటాకు’(Gorintaku) సీరియల్‌తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్‌కు పరిచయమైన నిఖిల్ మళియక్కల్(Nikhil Malayakkal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘గోరింటాకు’(Gorintaku) సీరియల్‌తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్‌కు పరిచయమైన నిఖిల్ మళియక్కల్(Nikhil Malayakkal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8(Bigg Boss) లో అడుగు పెట్టి ఏకంగా విజేతగా నిలిచాడు. ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. నిఖిల్ గోరింటాకు సీరియల్‌లో తనతో కలిసి నటించిన కావ్య(Kavya)తో ప్రేమలో పడ్డాడు. అలాగే ఆ బ్యూటీ కూడా నిఖిల్‌ను ఇష్టపడ్డది. అలా వీరిద్దరూ కలిసి పలు టీవీ షోల్లో పార్టిసిపేట్ చేశారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా వీరు చాలా క్లోజ్ గా ఉన్నారు.
అయితే సడెన్‌గా ఏమైందో కానీ బిగ్‌బాస్ షోకు ముందే ఈ లవ్ బర్డ్స్ విడిపోయారు. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ బిగ్ బాస్ షో లోనే చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఎప్పటికైనా కావ్యనే తనే భార్య అని.. కాళ్లు పట్టుకుని బతిమాలైనా సరే తన లైఫ్ లోకి తిరిగి తెచ్చుకుంటానంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ విన్నర్ అయ్యాక మాత్రం అతను చెప్పినట్టుగా కావ్యను రిక్వెస్ట్ చేయనట్టే అనిపించింది.
ఎందుకంటే కొన్ని టీవీ షోల్లో నిఖిల్, కావ్య ఒకరికొకరు ఎదురు పడినా చూసీ చూడనట్లు వెళ్లిపోయారు. అయితే ఇటీవల కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్‌లో నిఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ జంట మళ్లీ కలిపిపోతారనుకున్నారు అందరూ కానీ కొన్ని ఎపిసోడ్లలో కనిపించి తర్వాత నిఖిల్ ప్రజెంట్ కనిపించటంలేదు. దీంతో వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియక అభిమానులు తికమక పడుతున్నారు. ఈ ప్రేమ జంట కలవాలని ఇద్దరిని ట్యాగ్ లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే నాదో చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ఎవరి జీవితాలు వాళ్లు గడిపేస్తున్నాం. కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. ప్రొఫెషనల్‌గా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే.. నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి.. అలాగే ఎవరి పోస్టులకూ నన్ను ట్యాగ్ చేయకండి. మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, సపోర్ట్ నాకెప్పటికీ ఇలాగే కావాలి. ఐ లవ్యూ ఆల్ ‘ అని ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు నిఖిల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.






