- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Oscars-2025:‘వేశ్యలూ మనుషులే.. చిన్న చూపు చూడొద్దు’.. ఆ మూవీకి ఎన్ని ఆస్కార్ అవార్డులంటే?
లాస్ ఏంజిల్స్ (Los Angeles)లోని ఐకానిక్ డాల్బీ థియేటర్ (The iconic Dolby Theatre) ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రకటనకు వేదిక అయింది.

దిశ,వెబ్‌డెస్క్: లాస్ ఏంజిల్స్ (Los Angeles)లోని ఐకానిక్ డాల్బీ థియేటర్ (The iconic Dolby Theatre) ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రకటనకు వేదిక అయింది. ఈ నేపథ్యంలో డాల్బీ థియేటర్‌లో 97వ అకాడమీ అవార్డుల వేడుక ఈ రోజు(సోమవారం) గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకల్లో విజేతలకు ఆస్కార్ అవార్డులు అందించారు. ఆస్కార్స్–2025లో మైకీ మాడిసన్(Mikey Madison) ఉత్తమ నటిగా నిలిచిన విషయం తెలిసిందే. ‘అనోరా’ చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది. పట్టుమని 10 చిత్రాల్లో కూడా నటించకుండానే మైకీ మాడిసన్ ఈ ఘనత సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈ క్రమంలో ఆస్కార్స్-2025(Oscars-2025)లో హలీవుడ్ ఫిల్మ్ అనోరా సంచలనంగా మారింది. ‘అనోరా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీకి బెస్ట్ పిక్చర్‌తో సహా 5 కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. ఈ మూవీలో వేశ్యల గురించి ఉంటుంది. వారి గురించి చాలా అద్భుతంగా సినిమాలో వివరించారు. రష్యాలోని రిచ్ ఫ్యామిలీ యువకుడు అమెరికాలో ఒక వేశ్యను ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలియడంతో అతడిని పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ‘అనోరా’ అనేది ఒక లాటిన్ పదం. దీనికి తెలుగులో ‘గౌరవం’ అని అర్థం. ‘వేశ్యలూ మనుషులే.. వారిని చిన్న చూపు చూడొద్దు’ అని ఈ మూవీలో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.






